ఇండియాలో బ్లూ సిటీ ఎక్కడుందో తెలుసా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవిగో
జోధ్‌పూర్ నగరం
బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందింది జోధ్‌పూర్ నగరం. ఈ నగరం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ నగరాన్ని దాదాపు 650 సంవత్సరాల క్రితం నిర్మించారు.
రావ్ జోధా సింగ్
జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రావ్ జోధా సింగ్ స్థాపించారు. ఆయన ఈ నగరాన్ని ఒక ఎత్తైన కొండపై నిర్మించారు. కానీ జనాభా పెరిగే కొద్దీ దిగువ ప్రాంతాల్లో కూడా ఇళ్లు నిర్మించారు.
జోధ్‌పూర్ అంతా నీలిమయమే
జోధ్‌పూర్ నగరం బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందింది. మెహ్రాన్‌గఢ్ కోట నుండి చూస్తే సిటీ అంతా నీలంగానే కనిపిస్తుంది.
బ్లూసిటీ అని ఎందుకంటారు
ఇక్కడి ప్రజలు తమ ఇంటి లోపల ఏ రంగు వేసుకున్నా బయటి గోడలకు నీలం రంగునే వేస్తారు. ఎక్కువ ఇళ్లు బ్లూ రంగులోనే ఉంటాయి. అందుకే బ్లూ సిటీ అని పేరు వచ్చింది.
బ్లూ కలరే ఎందుకు వేస్తారు
దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి. కొందరు బ్రాహ్మణుల ఇళ్లు నీలి రంగులో ఉండటం వల్ల వారిని చూసి ఇతరుల కూడా ఇళ్లకు నీలి రంగు వేసుకోవడం ప్రారంభించారు.
ఎన్నో కారణాలు
చెద సమస్యకు చెక్ పెట్టడానికి, ఎండ నుంచి రక్షణ పొందడానికి ఇళ్లకు బ్లూ కలర్ వేస్తారన్న కారణాలు కూడా ఉన్నాయి. అందుకే బ్లూ సిటీగా జోధ్‌పూర్‌కి పేరు వచ్చింది.