Astrology

బెడ్ మీద తింటే ఏమౌతుందో తెలుసా

వాస్తు ప్రకారం

హిందూ మతంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన భాగం. అయితే వాస్తు ప్రకారం.. బెడ్ పై కూర్చొని అస్సలు తినకూడదు. ఎందుకంటే? 

పేదరికానికి దారితీస్తుంది

వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు పడకగదిలో బెడ్ పై కూర్చొని తింటే మీరు పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే తూర్పు లేదా ఉత్తరం వైపు నేలపై కూర్చొని భోజనం చేయడం మంచిది.

లక్ష్మీదేవి దూరం అవుతుంది

మీరు ప్రతిరోజూ బెడ్ పై కూర్చొని భోజనం చేస్తున్నట్టైతే మీ ఇంట్లో డబ్బు కొరత రావొచ్చు. వాస్తు ప్రకారం.. పడకగది ఉన్నది కేవలం పడుకోవడానికి మాత్రమే. 

ఇంట్లో అశాంతి

బెడ్ పై తింటే మీ ఇంట్లో ప్రశాంతత కరవవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ అలవాటు ఇంట్లో అశాంతికి కారణమవుతుంది. అందుకే దీన్ని మానుకోవాలి. 

రుణభారం పెరుగుతుంది

వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్ రూంలో తినే వారు విపరీతంగా అప్పులు చేస్తారు. వీరికి ఎప్పుడూ అప్పుల బాధలు ఉంటాయి. ఇది ఎంతో దుఃఖానికి దారితీస్తుంది.

నిద్రలేమి

పడకగదిలో తినే వారికి రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టుదు. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు ఫుడ్ వాసనకు ఇంట్లోకి కీటకాలు కూడా వస్తాయి. 

ఫుడ్

ఎప్పుడైనా సరే తినేటప్పుడు ప్లేట్ మన కంటే కొంచెం ఎత్తులో ఉండాలంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే ఇది అన్నపూర్ణ దేవిని గౌరవించడం అవుతుంది. 

నల్లదారం కట్టుకుంటే ఏమౌతుంది?

చాణక్య నీతి ప్రకారం ఉత్తమ భార్య ఎలా ఉండాలో తెలుసా?

యాలకులతో ఇలా చేస్తే.. మీ డబ్బు కష్టాలు దూరం

మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే అర్థమేంటో తెలుసా