వాస్తు శాస్త్రాన్ని ఫాలో అయితే జీవితంలోని నెగటివిటీ అంతా తొలగిపోయి పాజిటీవిటీ వస్తుందంటారు నిపుణులు. వాస్తు ప్రకారం..యాలకులు మన డబ్బు కష్టాలను తొలగిస్తాయి.
డబ్బు కష్టాలు దూరం
జీవితంలో డబ్బు కష్టాలను ఎదుర్కొంటుంటే.. యాలకులతో సమస్యను పరిష్కరించండి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పర్సులో 5 యాలకులు పెట్టుకోండి
మీరు లైఫ్ లో డబ్బు కష్టాలను ఎదుర్కొంటుంటే.. మీ పర్సులో లేదా డబ్బులు ఉంచే దగ్గర ఐదు యాలకులు పెట్టండి. ఇది ఆర్థిక సమస్యలను, ఖర్చులను తగ్గించి, సేవింగ్స్ ను పెంచుతుంది.
యాలకులు దానం చేయండి
ఏదైనా అవసరంలో ఉన్న పేదవారికి లేదా హిజ్రాలకు ఒక యాలకులతో పాటుగా కొంత డబ్బును దానం చేయండి. దీని వల్ల మీ పేదరికం దూరమవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
ప్రమోషన్ కోసం ఇలా చేయండి
జాబ్ లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే.. పడుకునే ముందు ఒక ఇలాచీని ఆకుపచ్చ వస్త్రంలో చుట్టి మీ దిండు కింద పెట్టుకోండి. దీన్ని ఎవరికైనా ఇవ్వండి.
యాలకులతో శుక్రుడిని బలపరచుకోండి
శుక్రుడిని బలపరచడానికి రెండు యాలకులను కొన్ని నీళ్లలో వేసి నీళ్లు సగమయ్యే వరకు మరిగించండి. ఈ వాటర్ ను స్నానపు నీటిలో కలిపి స్నానం చేయండి.