దుస్తులు శుక్ర గ్రహానికి చిహ్నం. ఇది ఆనందం, సంపదను ఇస్తుంది. కాబట్టి,దుస్తులు చిరిగితే వాటిని వెంటనే తొలగించాలి. లేకపపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
దుస్తులను ఎల్లప్పుడూ ఉతికిన తర్వాత మాత్రమే దానం చేయాలి. అప్పుడే ఆ బట్టల నుండి మీ పాపాలు తొలగిపోతాయి.
పాత ఉతికిన బట్టలను దానం చేయకుండా ఇంట్లో ఉంచుకుంటే, ఇంట్లో ఉన్నవారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ చిరిగిన బట్టలను దానం చేయకూడదు. అలా చేస్తే జాతకంలో రాహువు బలహీనపడతాడు. జీవితంలో విజయం సాధించలేరు.
ఋతువులకు అనుగుణంగా బట్టలు దానం చేస్తే అవసరమైన వారికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.