Astrology
సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదు అన్న మాటను పెద్దలు చెప్పడం వినే ఉంటారు. దీన్ని అశుభం అని కూడా చెప్తుంటారు.
పెద్దలు చెప్పే ఈ మాటలు మూఢనమ్మకంగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఒక మానసిక కారణం కూడా ఉంది. దాని గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
పండితుల ప్రకారం.. సంధ్యవేళ అంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే సాయంత్రం అవ్వకముందే ఇంటిని, ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటారు.
లక్ష్మీదేవి వచ్చే సమయం అంటే సంధ్యవేళ ఇంటి ముందు, ఇంటి గుమ్మం దగ్గర ఎవరైనా కూర్చుంటే లక్ష్మీదేవికి అడ్డంకిలా మారుతారు. అందుకే కూర్చోకూడదని చెప్తారు.
పండితుల ప్రకారం.. ఎవరైనా ఇంటి గుమ్మం దగ్గర దారి మూసేలా కూర్చున్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. అందుకే సాయంత్రం వేళల్లో గుమ్మం దగ్గర కూర్చోకూడదని అంటారు.
లక్ష్మీదేవి ఇంట్లోకి రాకపోతే పేదరికం పెరుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నశిస్తాయి. ఈ ఆలోచనతోనే మన పండితులు ఈ విధమైన ఆచారాలను రూపొందించారు.