Astrology

ఇండియాలో ఈ బాబాలు చాలా రిచ్ గురూ .. ఎంతో తెలుసా

రిచ్ బాబాలు

ఇండియాలో బాబాలకు కొదవ లేదు. అడుగడుగునా ఆధ్యాత్మికత  గురువులు మనకు కనిపిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది బాబాలు ఎంత రిచో తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.

బాబాల సంపద

బాబాలు సందేశాలను మాత్రమే కాదు.. వారి మతపరమైన సంస్థలు, ఆశ్రమాలు, వాణిజ్య సంస్థలతో ఎంతో సంపదను కూడబెట్టారు. వీరి పేరు ఎలా అయితే పెరుగుతుందో.. వారి సంపద కూడా పెరుగుతూ పోతుంది.

స్వామి నిత్యానంద

నిత్యానంద స్వామి నికర విలువ ఎంతనుకుంటున్నారు.. దాదాపుగా రూ. 10,000 కోట్లు. ఈయన నిత్యానంద ధ్యానపీఠం ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమాలు, ఆలయాలు, గురుకులాల నుంచి సంపాదిస్తున్నారు. 

బాబా రాందేవ్

రాందేవ్ బాబా కూడా చాలా రిచ్. ఈయన నికర విలువ ఏకంగా రూ. 1,600 కోట్లు. ఈయన పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ద్వారా సంపదిస్తున్నారు. 

శ్రీ శ్రీ రవిశంకర్

శ్రీ శ్రీ రవిశంకర్ కూడా  రూ. 1,000 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, ధ్యాన కేంద్రాలు,  ప్రపంచవ్యాప్తంగా వచే విరాళాల ద్వారా సంపాదిస్తున్నారు.

అసారాం బాపు

  అసారాం బాపు  ఇండియా, విదేశాల్లో విస్తరించిన పాఠశాలలు, ఆశ్రమాలు, సంస్థల ద్వారా  బాగా సంపాదిస్తున్నారు. ఈయన నికర విలువ: దాదాపుగా రూ. 10,000 కోట్లు. 

సద్గురు జగ్గీ వాసుదేవ్

సద్గురు జగ్గీ వాసుదేవ్ నికర విలువ ఏకంగా రూ. 18 కోట్లు. ఈయన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న ధ్యాన, యోగా కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే విరాళాల ద్వారా సంపద పెరిగింది.

ఆగస్టు 15న ఈ రాశుల వారు శుభవార్త వింటారు

ఈ రాశుల వారు ఈజీగా ప్రేమలో పడిపోతారు

ఐశ్వర్య రాయ్ జాతకం గురించి జ్యోతిష్యుడు ఏం చెప్పారో తెలుసా?