Asianet News TeluguAsianet News Telugu

జాబ్ కోసం హైదరాబాద్ కు బంగ్లాదేశ్ యువతి.. వ్యభిచారం చేయించిన భార్యాభర్తలు..

జాబ్ కోసం బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతి అక్రమ మార్గంలో హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అంతకు ముందే ఓ యాప్ ద్వారా పరిచయం అయిన ఓ యువతికి కాల్ చేసింది. ఆమె భర్తతో కలిసి వచ్చి బంగ్లా యువతిని ఇంటికి తీసుకెళ్లింది. తరువాత బంగ్లా యువతి దంపతులు వ్యభిచారం చేయించారు.

Young Bangladeshi woman to Hyderabad for job.. Husband and wife committed adultery..ISR
Author
First Published Feb 11, 2024, 11:18 AM IST


భర్త సంపాదించే డబ్బులు సరిపోవడం లేదని బంగ్లాదేశ్ కు చెందిన ఓ యువతి అక్రమ మార్గంలో హైదరాబాద్ కు వచ్చింది. ఆమె అవసరాన్ని అదనుగా చేసుకొని దంపతులు ఆమెతో వ్యభిచారం చేయించారు. అయితే దంపతులకు చెప్పకుండా ఆ యువతి ఓ కస్టమర్ దగ్గరకు వెళ్లింది. దీంతో వారు ఆమెను వెంబడించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులకు కాల్ చేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. 

వావ్.. నదిలో జాలర్లకు దొరికిన అరుదైన భారీ స్పటిక శివలింగం.. ఎంత విశిష్టమైనదో తెలుసా ?

అసలేం జరిగిందంటే ? 
‘ఈనాడు’ కథనం ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన షేక్ సోనియా, మహ్మద్ సల్మాన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పాతబస్తీలోని చంద్రాయణగుట్టలోని  ఘాజిమిల్లత్‌కాలనీలో నివసిస్తున్నారు. సోనియా తల్లి బంగ్లాదేశ్ కు చెందిన మహిళ కావడంతో ఆ దేశంతో సరిహద్దును పంచుకునే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా లో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులు మాట్లాడుకోవడానికి స్పెషల్ గా ఓ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో సోనియా చాటింగ్ చేస్తుండేది. 

పాకిస్థాన్ లో రోడ్డెక్కిన పీటీఐ మద్దతుదారులు.. దేశ వ్యాప్తంగా నిరసనలు.. అసలేమైందంటే ?

ఈ క్రమంలో ఆమెకు బంగ్లాదేశ్ లోని రాయ్ పూర్ కు చెందిన 22 ఏళ్ల స్రిస్టీ అక్తర్ పరిచయం అయ్యింది. ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఆసిఫ్‌ఖాన్‌ మేస్త్రీ  పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆ డబ్బులు సరిపోవడం లేదని తనకు హైదరాబాద్ లో జాబ్ దొరుకుతుందా అని ఆమె సోనియాను వాకబు చేసింది. ఇళ్లలో పని చేస్తే రూ.10 వేలు, వ్యభిచారం చేస్తే నెలకు రూ.20 వేల వరకు వస్తాయని ఆమె బదులిచ్చింది. ఏ పనైనా పర్వాలేదని, తనకు డబ్బులు కావాలని బంగ్లా యువతి తెలిపింది.

సీఎం జగన్ మహా నటుడు.. ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే - నాగబాబు

దీంతో రెండు నెలల కిందట ఆమె అక్రమ మార్గంలో ఎలాగోలా కలకత్తాకు చేరుకొని, అక్కడి నుంచి ట్రైన్ లో సికింద్రాబాద్ కు చేరుకుంది. షేక్ సోనియాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో సోనియా, సల్మాన్ లు వెళ్లి ఆమెను తమ నివాసానికి తీసుకొని వచ్చారు. తరువాత స్రిస్టీతో వ్యభిచారం చేయించడం ప్రారంభించారు. బయట కస్టమర్ ల దగ్గరకు వెళ్తే సోనియా కూడా ఆమె వెంట వెళ్లి, తిరిగి ఇంటిని తీసుకొని వస్తుండేది. ఇలాంటి సందర్భాల్లో సోనియా సెల్ ఫోన్ ను స్రిస్టీ దగ్గరే ఉంచుకునేది. 

MLC Kavitha: "నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే.. గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదు"

ఇదిలా ఉండగా.. శుక్రవారం సోనియా పక్కింటికి వెళ్లిన సమయంలో ఆమె సెల్ ఫోన్ కు కాల్ వచ్చింది. బంగ్లా యువతి ఆ కాల్ లిఫ్ట్ చేసింది. అత్తాపూర్ లో ఉన్న 150 పిల్లర్ నెంబర్ దగ్గరకు రావాలని అవతల ఆ కస్టమర్ చెప్పాడు. దీంతో సోనియాకు చెప్పకుండా సెల్ ఫోన్ అక్కడే పడేసి, ఆమె ఒక్కతే ఆటోలో కస్టమర్ వద్ద వెళ్లింది. సోనియా ఇంటికి వచ్చిన తరువాత స్రిస్టీ కనిపించలేదు. సెల్ ఫోన్ కింద పడి ఉండటంతో ఆమెకు డౌట్ వచ్చి లాస్ట్ గా కాల్ వచ్చిన నెంబర్ కు ఫోన్ చేసింది. అత్తాపూర్ కు వెళ్తోందని గ్రహించి ఆమెను దంపతులు వెంబడించారు. 

ముగిసిన లోక్ సభ సమావేశాలు... ప్రధాని మోదీ కీలక  ప్రసంగం..

చివరికి అత్తాపూర్ లో బంగ్లా యువతి ఆ దంపతులకు కనిపించడం, ఒంటరిగా ఎందుకు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో సెల్ ఫోన్ లాక్కొని సిస్ట్రీ 100కు కాల్ చేసింది. అత్తాపూర్ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఇదంతా బయటపడింది. తరువాత అత్తాపూర్ పోలీసులు నిందితులను చంద్రాయాన్ గుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios