direct digital release  Amrutharamam MOVIE REVIEW

`అమృతారామ‌మ్‌` మూవీ రివ్యూ

గత నాలుగు రోజులుగా ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అంటూ ఊదరకొడుతున్న సినిమా రిలీజైంది. మార్చి 25న ఉగాది సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసినా క‌రోనా వైర‌స్ కార‌ణంగా అనివార్య ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యింది.  అమృతారామం అనే టైటిల్ తో వచ్చిన ఈ  చిత్రం జీ5 న ఈరోజు మన ముందుకు వచ్చింది.  అయితే ఈ సినిమాకు కేవలం డైరక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ప్రత్యేకత తప్పించి, ఇంకేమైనా ఉందా...థియోటర్ లో రిలీజ్ అయితే ఏమన్నా కలిసొచ్చేదా లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ఈ సినిమాకు మంచిదైందా...సురేష్ బాబు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పూనుకోవటానికి ఉన్న స్పెషల్ కంటెంట్ ఏమిటో రివ్యూలో చూద్దాం.