శశిథరూర్ కు అరుదైన గౌరవం.. అత్యున్నత పౌరస్కారంతో సత్కరించిన ఫ్రెంచ్.. ఏమిటీ దాని ప్రత్యేకతలు..
శశిథరూర్ (Shashi Tharoor)కు ఫ్రెంచ్ తన అత్యున్నత పౌర పుస్కారం (Shashi Tharoor was awarded his highest civilian award by the French) అందించింది. ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడంలో, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ఈ గౌరవాన్ని అందించింది.
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశిథరూర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ తమ అత్యున్నత పౌర పురస్కారం 'చెవాలియర్ డి లా లెజియన్ డి హొన్నూర్'తో ఆయనను సత్కరించింది. ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడంలో, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలో శశిథరూర్ పాత్రను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఫ్రెంచ్ సెనేట్ చైర్మన్ గెరార్డ్ లార్చర్ ఫ్రెంచ్ రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును శశిథరూర్ కు ప్రదానం చేసింది.
వామ్మో.. జగజ్యోతి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తి పత్రాలు.. వాటి విలువ తెలిస్తే.. (వీడియోలు)
భారత్-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడానికి శశిథరూర్ చేస్తున్న అవిశ్రాంత కృషి, అంతర్జాతీయ శాంతి, సహకారం పట్ల ఆయన నిబద్ధత ఈ గౌరవానికి ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు అని భారత్ లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా.. ఐక్యరాజ్యసమితిలో అండర్ సెక్రటరీ జనరల్ గా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, భారత్ లో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా శశిథరూర్ సేవలందించారు. ఆయన విస్తృతమైన పార్లమెంటరీ అనుభవం, అనేక పుస్తకాలలో ప్రదర్శించిన ఆయన సాహిత్య నైపుణ్యాల్లో కొన్ని ఫ్రెంచ్ లోకి అనువదించారు. ఇది ఆయన బహుముఖ ప్రజ్ఞను మరింత విస్తరించింది.
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. టిక్కెట్స్ ఇచ్చేందుకు కండక్టర్ సర్కస్ ఫీట్లు.. వీడియో వైరల్
ఫ్రెంచ్ సెనేట్ చైర్మన్ నుంచి ప్రశంసలు
ఈ గౌరవం పొందడం పట్ల చైర్మన్ గెరార్డ్ లార్చర్ థరూర్ పై ప్రశంసలు కురించారు. ఆయన నిజమైన ఫ్రాన్స్ స్నేహితుడని, ఫ్రెంచ్ సంస్కృతిపై లోతైన అవగాహన ఉన్న 'ఫ్రాంకోఫోన్' అని కొనియాడారు. థరూర్ కెరీర్ గమనాన్ని, ప్రపంచ దృక్పథాన్ని లార్చర్ ప్రశంసించారు, భారతదేశానికి, అంతర్జాతీయ సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను కొనియాడారు.
ప్రముఖ న్యాయ నిపుణుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూత..
ఈ పురస్కారం రావడం పట్ల తన శశిథరూర్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం, ఫ్రాన్స్ మధ్య లోతైన బంధాలను, సాంస్కృతిక మార్పిడి, దౌత్య సహకారాన్ని పెంపొందించడం కొనసాగిస్తానని చెప్పారు. ప్రపంచ సమాజ శ్రేయస్సు కోసం మరింత సహకారాన్ని ప్రోత్సహించడానికి తన నిబద్ధత ఇలాగే ఉంటుందని చెప్పారు.