HomeBigg Boss

Shekar Basha

శేఖర్‌ బాషా
శేఖర్‌ బాషా
ప్రస్తుత స్టేటస్ఎలిమినేటెడ్
నిక్ నేమ్శేఖర్‌ బాషా
ప్రొఫెషన్ఆర్జే, యాక్టివిస్ట్
పుట్టిన రోజుజులై 6, 1982
వయసు42 ఏళ్లు
పుట్టిన ప్రాంతంఈస్ట్ గోదావరి, India
అలవాట్లుఆర్జే, యాంకరింగ్
ఎలా ఫేమస్రేడియో జాకీ

బయోగ్రఫీ

శేఖర్ బాషా... ఫేమస్ ఆర్జే (రేడియో జాకీ), వీజే (టీవీ యాంకర్), ఇంకా క్రీడా వ్యాఖ్యాత (క్రికెట్ కామెంటేటర్) కూడా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శేఖర్ బాషా.. స్వస్థలం ఏపీలోని కాకినాడ. హైదరాబాద్‌లోని 92.7 బిగ్ ఎఫ్ఎమ్‌లో ప్రసారమయ్యే "కిక్" కార్యక్రమంతో బాగా పాపులర్. టీవీ రంగంలోనూ ఆయన పేరు తెచ్చుకున్నారు. శేఖర్ బాషా ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానళ్లలో వీజేగా పనిచేశాడు.

కెరీర్‌
శేఖర్‌ బాషా ఆర్జీగా కెరీర్‌ని ప్రారంభించాడు. ఇప్పటికీ ఆర్జీగా, అట్నుంచి యాక్టివిస్ట్ గా మారారు. యాంకర్‌గా అనేక ప్రోగ్రామ్స్ చేశారు. 2019లో ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ సీజన్‌లో శేఖర్ బాషా క్రీడా వ్యాఖ్యాతగా (కామెంటేటర్) వ్యవహరించాడు. రేడియో రంగంలో అతని ప్రతిభకు గుర్తింపుగా, భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన "ఎక్సలెన్స్ ఇన్ రేడియో" (ఐఆర్ఎఫ్) పురస్కారాన్ని 19 సార్లు గెలుచుకున్న ఏకైక భారతీయ ఆర్జేగా నిలిచాడు శేఖర్ బాషా. 2019లో, ఇండియా రేడియో ఫోరమ్ నుంచి "ఉత్తమ రేడియోజాకీ" పురస్కారాన్ని కూడా శేఖర్ బాషా అందుకున్నాడు. 2017లో, "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" సర్వే ప్రకారం.. టీవీ, రేడియో రంగాలలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి 10 స్థానాల్లో నిలిచాడు. టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో కింగ్‌గానే నిలిచాడు.

Biography
@ Copyright 2024 Asianet News Media & Entertainment Private Limited