Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | అవినాశ్ |
పుట్టిన రోజు | సెప్టెంబర్ 22, 1986 |
వయసు | 38ఏళ్లు |
పుట్టిన ప్రాంతం | కరీంనగర్ |
ప్రొఫెషన్ | కమెడియన్ |
అలవాట్లు | కామెడీ షోస్ |
ఎలా ఫేమస్ | జబర్దస్త్ షో |
కరీంనగర్‌కి చెందిన ముక్కు అవినాష్.. మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నారు. దాని ద్వారా పాపులర్ అయ్యాడు. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగ లేక చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చింది. బిటెక్ స్టడీస్ చేసిన ఆయన ఆ దిశగా వెళ్లలేదు. సినిమాల్లో రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు. స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. ముక్కు అవినాష్‌గా పాపులర్ అయ్యాడు. దీని ద్వారా అటు బిగ్ బాస్‌లోకి వచ్చాడు. టీవీ షోస్ చేస్తూ, సినిమాలు కూడా చేస్తున్నాడు.
కెరీర్
ముక్కు అవినాష్ జబర్దస్త్ షో తో పాపులర్ అయ్యాడు. ఈటీవీ, స్టార్ మా వంటి ఛానెల్స్ లో కామెడీ షోస్‌లో పాల్గొని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో పలు సినిమాల్లోనూ నటించే అవకాశాలు అందుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అందులో తనదైన కామెడీతో అలరించారు. ఇప్పటికీ `స్టార్ మా పరివార్` వంటి పలు షోస్‌లో పాల్గొంటున్నాడు. అంతకు ముందు `కామెడీ స్టార్స్` చేశారు. ఇటీవల `బూట్ కట్ బాలరాజు` సినిమాలోనూ మెరిశాడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ తెలుగు 8కి ఎంట్రీ ఇచ్చాడు.