Associate Partner
Associate Partner
Associate Partner
ప్రస్తుత స్టేటస్ | ఎలిమినేటెడ్ |
---|---|
నిక్ నేమ్ | గౌతం కృష్ణ |
పుట్టిన రోజు | ఏప్రిల్ 13, 1996 |
వయసు | 28 |
పుట్టిన ప్రాంతం | హైదరాబాద్ |
ప్రొఫెషన్ | డాక్టర్ |
అలవాట్లు | యాక్టింగ్ |
ఎలా ఫేమస్ | బిగ్ బాస్ |
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన గౌతమ్ కృష్ణ స్వతహగా డాక్టర్. ఆయన ఎంబీబీఎస్ చేశాడు. డాక్టర్‌గా రాణిస్తున్నారు. కానీ యాక్టింగ్ అంటే పిచ్చి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ స్ట్రగుల్ అవుతూ, ఒకటి అర అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. ఈ క్రమంలో గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్నాడు. అశ్వత్థామ అంటూ రచ్చ చేశాడు.
కెరీర్
గౌతమ్ కృష్ణ డాక్టర్ పనిచేస్తున్నారు. కానీ సినిమాలంటే ఇష్టం. నటుడిగా రాణించాలనుకున్నాడు. డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి సినిమా రంగంలోకి వచ్చాడు. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు. దాని ద్వారానే ఫేమస్ అయ్యాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. `ఆకాశ వీధుల్లో` అనే సినిమాలోనూ నటించాడు. గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో సందడి చేశాడు. ఇప్పుడు `సోలో బాయ్స్` అనే సినిమాలోనూ హీరోగా నటించాడు. ఇది విడుదలకు రెడీగా ఉంది. ఈ క్రమంలో ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా మరోసారి బిగ్ బాస్ షోకి రావడం వివేషం.