Hardik Pandya: గాయం కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వరల్డ్‌కప్ 2023 కు దూరం కావాల్సి వచ్చింది. కాగా.. ఆ ఆల్ రౌండర్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, వారికి నిరీక్షణకు ఇప్పట్లో తెర పడేలా లేదు. పాండ్యా హెల్త్ ఎలా ఉంది? టీమిండియాలోకి రీఎంట్రీ ఎప్పుడు? అనేది చర్చనీయంగా మారింది.
Hardik Pandya: ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రపంచ కప్ 2023 నుండి పూర్తిగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆల్ రౌండర్ పునరాగమనం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, వారికి నిరీక్షణకు ఇప్పట్లో తెర పడేలా లేదు. హార్దిక్ ఎన్ని సిరీస్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. హార్దిక్ గాయానికి సంబంధించి తాజాగా ఓ షాకింగ్ అప్‌డేట్ వచ్చింది.
ప్రపంచకప్ తర్వాత కూడా హార్దిక్ జట్టులోకి రావడం చాలా కష్టమే కానున్నది. వాస్తవానికి ప్రపంచ కప్ తర్వాత..నవంబర్ 23 నుంచి టీమ్ ఇండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత జట్టుకు కొంత విశ్రాంతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 10న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అలాగే.. ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాతో కలిసి ట్రై సిరీస్ ఆడవలసి ఉంది. ఈ సిరీస్ లన్నింటికి హార్దిక్ గాయం కారణంగా దూరం కానున్నట్టు సమాచారం.
undefined
పాండ్యా రీఎంట్రీ ఎప్పుడు?
హార్దిక్ రీఎంట్రీ సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. పలు మీడియా కథనాల ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఫిబ్రవరి 2024 నాటికి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే.. ఐపీఎల్‌కు కొంత సమయం ముందు హార్దిక్ టీమ్ ఇండియాలోకి తిరిగి రావచ్చు. హార్దిక్‌కు 2023 ప్రపంచ కప్‌లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అతను కేవలం 4 మ్యాచ్‌ల్లో ఆడి.. కేవలం 11 పరుగులు చేశాడు. అలాగే.. బౌలింగ్‌లో 5 వికెట్లు తీసుకున్నాడు.లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో లింటన్ దాస్ కొట్టిన బంతిని కాలితో ఆపడానికి ట్రై చేశాడు. ఈ ప్రయత్నంలో కింద పడిపోయాడు. కాలు మడిమకు గాయం కావడంతో మళ్లీ లేవలేకపోయాడు. ట్రీట్ మెంట్ కోసం హర్థిక్ ను బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంపిచారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న హర్థిక్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
నిజానికి హార్దిక్ పాండ్యా .. టీమిండియాకు పెద్ద అసెర్ట్, అతను టోర్నమెంట్ నుండి నిష్క్రమించడం జట్టుకు పెద్ద దెబ్బ. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని చూడటానికి హార్దిక్ ముంబైలోని వాంఖడే స్టేడియం చేరుకున్నాడు. హార్దిక్ త్వరగా కోలుకోని వీలైనంత త్వరగా జట్టులోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.