Spiritual
కళ్లు అదరడానికి శాస్త్రీయంగా, సైన్సుపరంగా అనేక కారణాలున్నాయి. స్త్రీలు, పురుషులు ఇద్దరిలో కుడి, ఎడమ రెండు కళ్లు అదురుతుంటాయి.
చాలామంది ఎడమ కన్ను అదిరితే అశుభం అంటారు. కాని జ్యోతిష్యం ప్రకారం పురుషులకు ఒకలా, స్త్రీలకు మరోలా ఫలితం కలుగుతుంది.
ఎడమ కన్ను అదిరితే స్త్రీలకు మంచి జరుగుతుంది. ఇది అదృష్టానికి చిహ్నం.
జ్యోతిష్యం ప్రకారం ఎడమ కన్ను అదిరితే పురుషులకు నష్టం జరుగుతుంది. ఊహించని సమస్యలు రావచ్చు.
శాస్త్రం ప్రకారం కుడి కన్ను అదిరితే పురుషులకు మంచి జరుగుతుంది. స్త్రీలకు లేనిపోని చిక్కులు వస్తాయి.
శరీరంలో నీరు, పోషకాలు లేకపోతే కళ్లు అదురుతుంటాయి. కాబట్టి ఆహారంపై శ్రద్ధ వహించాలి.
మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్ వాడకం వల్ల కళ్లు అదురుతుంటాయి. కళ్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి.