Spiritual
కొందరు మీ మాటలు శ్రద్ధగా వింటారు, కానీ వారి రియాక్షన్ చూస్తే, వారు మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోవట్లేదని తెలుస్తుంది.
నటించే వ్యక్తులు నమ్మదగిన వారు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి! నటించే మీ స్నేహితులను, బంధువులను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
ఎటువంటి వాదన లేకుండా ప్రతిదానికి "అవును, నిజమే!" అనే వారు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాత్రమే ఒప్పుకుంటారు, నిజమైన అభిప్రాయం చెప్పరు.
మీరు మాట్లాడిన ప్రతిసారి వెంటనే "కానీ..." అంటూ వ్యతిరేకించే వారిని నమ్మకండి, వారు మీ ఆలోచనలను అణచివేయాలని అనుకుంటారు.
కొందరు మీ సీరియస్ విషయాలను విని నవ్వుతారు లేదా వెటకారంగా మాట్లాడుతారు, అలాంటి వారు ఎప్పటికీ మీకు మంచి కోరుకునేవారు కాదు.
మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో చూసి, సొంత అభిప్రాయం లేకుండా మాట్లాడే వారిని నమ్మకండి.
మీరు మాట్లాడటం అయిపోగానే కొత్త టాపిక్ మొదలుపెడతారు, అంటే వారు మీ మాటలకు విలువ ఇవ్వడం లేదు.
కొందరు చిన్న విషయాలకే ఎక్కువ ఎమోషనల్ అవుతారు, దాంతో నిజం, అబద్ధం తెలుసుకోవడం కష్టం అవుతుంది.
మీరు చెప్పే మాటలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తారు, దీనివల్ల అపార్థాలు వస్తాయి. ఇలాంటి వ్యక్తులు మీకు ప్రమాదకరం.
మీ ముందు ఒకలా, మీ వెనకాల ఒకలా మాట్లాడే వ్యక్తులు ఎప్పటికీ నమ్మదగినవారు కాదు.