Spiritual

ఖాళీ చేతులతో ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు

ఈ 5 ప్రదేశాలకు ఖాళీ చేతులతో వెళ్లకూడదా?

హిందూ ధర్మంలో 5 ప్రదేశాలకు ఖాళీ చేతులతో వెళ్లకూడదు. ఇలా చేయడం అశుభం. ఈ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఏదో ఒక కానుక తీసుకెళ్లాలి. ఆ 5 ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం…

గుడికి ఖాళీ చేతులతో వెళ్లకండి

గుడికి దేవుడి దర్శనానికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకూడదు. డబ్బులు లేకపోతే ₹5-10 విలువ చేసే పూలు అయినా తీసుకెళ్లాలి.

గురువుగారికి కానుక తీసుకెళ్లండి

గురువుగారిని కలవడానికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకూడదు. చిన్నదైనా సరే, ఏదో ఒక కానుక తీసుకెళ్లాలి. దాని వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

అక్క/చెల్లి ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లకండి

అక్క/చెల్లి ఇంటికి కూడా ఖాళీ చేతులతో వెళ్లకూడదు. డబ్బులు లేకపోతే పిల్లలకి చాక్లెట్లు, టాఫీలు అయినా తీసుకెళ్లాలి. అదృష్టం కలిసి వస్తుంది.

కూతురు ఇంటికి ఏదైనా తీసుకెళ్లండి

కూతురిని కలవడానికి వెళ్లేటప్పుడు డబ్బులు లేకపోతే బాధపడక్కర్లేదు. అరటి పండ్లు లేదా ఏవైనా సాధారణ పండ్లు తీసుకెళ్లవచ్చు.

స్నేహితుల ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లకండి

స్నేహితుల ఇంటికి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్లాలి. చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి తీసుకెళ్లవచ్చు.

వనవాసంలో సీతారాములు ఎన్ని ప్లేసుల్లో నివసించారో తెలుసా?

చాణక్యనీతి: గౌరవం కోల్పోకుండా క్షమాపణలు చెప్పేదెలా?

చాణక్య నీతి: భార్య లో భర్త కోరుకునే గుణాలు ఇవే

చాణక్య నీతి: ఈ 3 పనులు మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయి