pregnancy & parenting
తల్లిదండ్రులు మానసిక ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో పిల్లలు గమనిస్తారు. అది ఆర్థిక సమస్య అయినా ఏదైనా సరే.
తల్లిదండ్రుల సంభాషణలో ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఎలా ఉన్నా.. వాళ్లు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో పిల్లలు గమనిస్తారు.
తల్లిదండ్రులు నమ్మకంగా, ధైర్యంగా మాట్లాడుతున్నారా? లేదా తమను తాము తక్కువ చేసుకుని మాట్లాడుతున్నారా అని పిల్లలు గమనిస్తారు.
తల్లిదండ్రులు తెలియని వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు చూసి నేర్చుకుంటారు.
భిన్నాభిప్రాయాలు తప్పనిసరి. కానీ వాటిని తల్లిదండ్రులు ఎలా పరిష్కరిస్తారో పిల్లలు చూసి నేర్చుకుంటారు.
జీవితంలో చిన్న లేదా పెద్ద సందర్భాలను తల్లిదండ్రులు ఎలా జరుపుకుంటారో పిల్లలు చూస్తారు.