Lifestyle
వారానికి ఒకసారి బేకింగ్ సోడాతో బాత్రూమ్ శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.
ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు, వెనిగర్ కలిపి బాత్రూమ్ గోడలకు, మూలలకు స్ప్రే చేస్తే దుర్వాసన తగ్గుతుంది.
ఉప్పు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని బాత్రూమ్ లో నేలపై వేసి శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.
రోజూ బాత్రూమ్‌లో కర్పూరం వెలిగిస్తే దుర్వాసన తగ్గుతుంది. గాలిని శుద్ధి చేస్తుంది.
స్ప్రే బాటిల్‌లో నీళ్లు, ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ కలిపి బాత్రూమ్ అంతా స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది.
బాత్రూమ్‌లో తేమ ఉంటే దుర్వాసన వస్తుంది. కాబట్టి ఎప్పుడూ పొడిగా ఉంచడానికి ట్రై చేయండి.