ఒక కప్పు నీటిలో నిమ్మరసం కలిపి 15 నిమిషాలు మూతపెట్టి బాగా మరిగించాలి. తర్వాత చల్లార్చి ఎప్పటిలాగే కడగాలి.
మీ కుక్కర్ పూర్తిగా మాడిపోతే కల్లుప్పు వేసి కొంతసేపు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రం చేస్తే మాడంతా పోతుంది.
మీ కుక్కర్ అడుగున అంటుకుంటే బేకింగ్ సోడా వేసి, పొడి గుడ్డతో లేదా దూదితో తుడిస్తే మరక పూర్తిగా పోతుంది.
అంటుకుపోయిన ప్రెషర్ కుక్కర్‌ను వెనిగర్, నిమ్మరసంతో శుభ్రం చేయవచ్చు. రెండింటినీ కలిపి శుభ్రం చేస్తే మరకలు వెంటనే పోతాయి.
కుక్కర్ మరకలను శుభ్రం చేయడానికి నిమ్మరసం, సబ్బు పొడిని ఉపయోగించండి. నీటిలో సబ్బు పొడి, నిమ్మరసం కలిపి మరిగించి శుభ్రం చేయొచ్చు.
కాలిన కుక్కర్‌లో ఉల్లిరసం, వెనిగర్ కలిపి కుక్కర్‌లో పోసి బాగా రుద్దితే వెంటనే శుభ్రమవుతుంది.