వేసవిలో జుట్టు త్వరగా మురికి అవుతుంది. కానీ, తరుచు షాంపూ చేస్తే.. జుట్టు పొడిబారి, రాలిపోతుంది. కాబట్టి రసాయనాలు లేని తేలికపాటి షాంపూ వాడండి.
వేసవి వేడి వల్ల చెమట కారణంగా తలలో దురద, మురికి పేరుకుపోయి ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి వారానికి రెండుసార్లు తలస్నానం చేయండి.
వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు స్కార్ఫ్, టోపీ లేదా ఏదైనా కప్పుకోండి. లేదంటే జుట్టు సూర్య కిరణాల వల్ల దెబ్బతింటుంది.
జుట్టు పెరుగుదలకు నూనె రాసుకోవడం ముఖ్యం. కానీ వేసవిలో బరువైన నూనెలు వాడకూడదు. తేలికపాటి నూనెలు వాడండి.
వేసవిలో శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి జుట్టు రాలకుండా ఉండాలంటే రోజుకు తగినంత నీరు త్రాగండి, పండ్లు తినండి.
వేసవిలో హెయిర్ డ్రైయర్, స్ట్రెయిట్నెర్ వంటివి వాడకుండా ఉండటం మంచిది. ఇవి జుట్టును బలహీనపరుస్తాయి, సహజ మెరుపును పోగొడతాయి.
వేసవిలో వారానికి రెండుసార్లు పెరుగు, కలబంద వంటి వాటితో హెయిర్ మాస్క్ వేసుకోండి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.