Health
మైక్రో ప్లాస్టిక్స్ రేణువులు లేని ప్లేస్ లేదు. ఆహారం, నీరు, గాలిలో ఎక్కడ చూసినా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి.
కంటికి కనిపించని ఈ చిన్న కణాలు పాదరసం, పురుగుమందుల వంటి హానికరమైన విషాలతో సమానం.
మైక్రోప్లాస్టిక్స్ రోగనిరోధక ప్రతిస్పందనలను అడ్డుకుంటుంది. ఇవి శరీర కణజాలానికి హాని చేస్తాయి.
మైక్రోప్లాస్టిక్స్ నుండి వచ్చే రసాయనాలు ఎండోక్రైన్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయి.
మైక్రో ప్లాస్టిక్ వల్ల ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి.
దీర్ఘకాలం ఎక్స్పోజర్ వల్ల దద్దుర్లు, తామర వంటి సమస్యలు వస్తాయి. చర్మం రంగు మారడం జరుగుతుంది.
మెదడులో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, వణుకు వంటి సమస్యలు వస్తాయి.
ఇవి జీవక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
పీల్చిన మైక్రోప్లాస్టిక్స్ ఊపిరితిత్తుల పనితీరును తగ్గిస్తాయి. శ్వాస సమస్యలకు కారణమవుతాయి.
మైక్రో ప్లాస్టిక్ నుంచి రక్షణ పొందాలంటే గ్లాస్ లేదా మెటల్ కంటైనర్లను ఉపయోగించండి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను నివారించండి.