Health
గర్భ నిరోధక మాత్రలు కొందరిలో బరువు పెరిగేలా చేస్తాయి.
హార్మోన్ల మార్పుల వల్ల చాలా మంది ఆడవాళ్లలో ఆందోళన, డిప్రెషన్ వస్తాయి.
హార్మోన్ గర్భ నిరోధక పద్ధతులు టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తాయి.
కొన్ని గర్భ నిరోధక మాత్రల వల్ల రక్తం గడ్డకట్టడం, పక్షవాతం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
హార్మోన్ల మార్పుల వల్ల కొందరు ఆడవాళ్లకి మైగ్రేన్ వస్తుంది.
కొంతమంది ఆడవాళ్లకి గర్భ నిరోధక మాత్రలు తీసుకుంటే వికారం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయి.
ఈ మాత్రల వల్ల కొందరికి ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతుంది. ఇది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది.
గర్భ నిరోధక మాత్రలు ఎక్కువ కాలం వాడితే బి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ లాంటి పోషకాలు తగ్గిపోతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. జుట్టు కూడా రాలుతుంది.