రేబిస్ ఉన్న జంతువు కరిస్తే మనుషులకు రేబిస్ వస్తుంది. ఇలాంటి జంతువు కరిస్తే వెంటనే చేయాల్సిన 7 పనులు తెలుసుకుందాం.
కుక్క కరిస్తే వెంటనే 15 నిమిషాలు గాయం నీళ్ళతో కడగాలి. సబ్బుతో కడగడం మంచిది.
కుక్క కరిస్తే గాయానికి కట్టు కట్టొద్దు. గాయం ఓపెన్ గానే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. బ్లీడింగ్ ఎక్కువైతే శుభ్రమైన గుడ్డతో కట్టు కట్టవచ్చు.
రేబిస్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి. గాయం లేకుండా కుక్క నాకినా, తాకినా వ్యాక్సిన్ అవసరం లేదు.
కుక్క గీరినా, రక్తం కారకుండా కరిచినా డాక్టర్ ని సంప్రదించాలి.
ముఖం, చేతులు, మెడ మీద కరిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ముఖం మీద కరిస్తే వైరస్ త్వరగా మెదడుకు చేరుతుంది.
పిచ్చి కుక్క కరిస్తే రేబిస్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ తీసుకోవాలి. అన్ని డోసులు వేయించుకోవాలి.
పిల్లలకు వ్యాక్సిన్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, గాయం మానకపోవడం, ఇతర ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ ని చూపించాలి.