Health
ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల జుట్టు విరిగిపోవడమే కాకుండా పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి కొన్ని హెయిర్ మాస్క్‌లను ఉపయోగించవచ్చు.
కలబంద, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్‌ను జుట్టుకు పట్టించండి. కలబందలోని అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, C, E తో పాటు తేమ దెబ్బతిన్న జుట్టును బాగుచేస్తుంది.
జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి తేనెతో అరటిపండును కలిపి పట్టించండి. గుడ్డును కూడా కలపవచ్చు. దీనివల్ల దెబ్బతిన్న జుట్టు బాగుపడుతుంది.
అరకప్పు పెరుగులో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించండి. ఈ హెయిర్ మాస్క్ ఎండ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును కాపాడుతుంది.
బయోటిన్, విటమిన్ బి, ఎ లతో నిండిన ఆవకాడోను ఒక గుడ్డుతో కలిపి జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఉంచాలి.