ఐస్ క్రీంలో క్యాలరీలు, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి అధిక బరువు ఉన్నవారు ఐస్ క్రీం తినకూడదు.
షుగర్ పేషెంట్లు ఐస్ క్రీం తినకూడదు అని చెప్పడం సరికాదు. కానీ, తక్కువ కార్బోహైడ్రేట్ , చక్కెరతో కూడిన ఐస్ క్రీంను వారు తినవచ్చు. ఎక్కువ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు
ఐస్ క్రీమ్ లో అధికంగా ఉండే ఫ్యాట్ , చక్కెర శరీరంలో కొవ్వును పెంచుతాయి, గుండె సమస్యలు రావచ్చు.
ఎక్కువ ఐస్ క్రీం తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, గ్యాస్, వాపు వంటి సమస్యలు వస్తాయి.
ఎక్కువ ఐస్ క్రీం తింటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గుతుంది.
ఐస్ క్రీం పాడవకుండా ఉండటానికి అందులో చాలా రకాల రసాయనాలు కలుపుతారు. అవి శరీర ఆరోగ్యానికి హానికరం.