Food
స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం ఫ్రిడ్జ్ లో ఉంచిన పచ్చి పాలల్లో ఫ్లూ వైరస్ 5 రోజుల వరకు సజీవంగా ఉంటుంది. ఆ పాలు తాగాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి.
వేడి చేసిన పాల కంటే పచ్చి పాలలో ఎక్కువ పోషకాలు, ఎంజైమ్‌లు, ప్రోబయోటిక్స్ ఉంటాయని కొందరు అంటారు. కానీ, ఇది అనారోగ్యానికి దారితీస్తుంది.
పచ్చి పాలు తాగితే ఈ. కోలై, సాల్మొనెల్లా వంటి బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని వల్ల 200కు పైగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
పచ్చి పాలు సురక్షితంగా తాగడానికి పాశ్చరైజేషన్ ఉత్తమ మార్గం. ఇంట్లో కూడా దీన్ని చేయవచ్చు.
పచ్చి పాలు మీడియం మంట మీద 161°F వరకు వేడి చేయాలి. ఫుడ్ థర్మామీటర్ ఉపయోగించి ఉష్ణోగ్రత చూసుకోవచ్చు.
పాలు 161°F చేరుకున్నాక కనీసం 15 సెకన్ల పాటు ఆ ఉష్ణోగ్రతలో ఉంచాలి. దీని వల్ల పోషకాలు పోకుండా ఉంటాయి. క్రిములు నశిస్తాయి.
పాత్రను మంట మీద నుంచి దించి, పాలు శుభ్రమైన పాత్రలో పోయాలి. ఐస్ నీటిలో ఉంచి 40°F కంటే తక్కువ ఉష్ణోగ్రతకు త్వరగా చల్లార్చాలి.