Food
అన్నంలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా ఉంటాయి. అన్నం గ్లైసెమిక్ సూచిక ఎక్కువ.
అన్నం ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ పేషెంట్లు ఎక్కవ తినకూడదు.
కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రైస్ ఎక్కువగా తింటే పొట్ట చుట్టు కొవ్వు పెరుగుతుంది.
అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు.
షుగర్, అధిక బరువు ఉన్నవాళ్లు రోజుకి చాలాసార్లు అన్నం తినడం మంచిది కాదు.
షుగర్, అధిక బరువు ఉన్నవాళ్లు అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా ఒకపూట తక్కువ మోతాదులో తినొచ్చు.
డాక్టర్ లేదా న్యూట్రీషనిస్ట్ సలహా తీసుకున్నాకే మీరు డైట్‌లో మార్పులు చేసుకోండి.