Food
ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగే ఛాన్సుంది. అందుకే ఉప్పు తక్కువ తినాలి.
రక్తంలొని ఉప్పును, నీళ్లను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. ఉప్పు ఎక్కువైతే కిడ్నీలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
బాడీలో ఉప్పు ఎక్కువైతే, మూత్రం ద్వారా కాల్షియం బయటికి పోతుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.
ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
ఉప్పులో ఉండే సోడియం చర్మ సమస్యలకు దారితీస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక మనిషి రోజుకు 2 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలి.
డాక్టర్ సలహా తీసుకున్నాకే ఆహారంలో మార్పులు చేసుకోండి.