Food
సూజీ/రవ్వ – 1 కప్పు, పెరుగు ఒక కప్పు, ఈనో ఫ్రూట్ సాల్ట్ చిన్న స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, వాటర్, నెయ్యి లేదా నూనె, ఆవాలు, కరివేపాకు, పచ్చి మిర్చి.
ఒక గిన్నెలో సూజీ/రవ్వ, పెరుగు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీరు వేసి బాగా కలపండి. దీనిని 10–15 నిమిషాలు మూత పెట్టి ఉంచండి.
ఒక ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేడి చేసి ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయండి. తురిమిన క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపును పిండిలో కలపండి.
తర్వాత పిండిలో ఈనో వేసి వెంటనే కలపండి. పిండి పొంగడం మొదలవుతుంది. దీని బదులు బేకింగ్ సోడా, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
ఇడ్లీ పాత్రలకు నూనె రాయండి. ఆపై పిండిని వెంటనే అందులో వేయండి.
ఇడ్లీలను 10-12 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై ఉడికించండి. మెత్తటి దూదిలాంటి ఇడ్లీలను పాత్ర నుంచి తీసి వేడి వేడిగా చట్నీతో వడ్డించండి.