Cricket

LSG vs MI: ఐపీఎల్ 2025లో థ్రిల్లింగ్ విక్టరీ.. సూపర్ మూమెంట్స్ !

టాస్ గెలిచిన MI కెప్టెన్

IPL 2025 16వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

మిచెల్ మార్ష్ అదిరిపోయే ఆరంభం

మొదట బ్యాటింగ్ చేస్తూ లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 60 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.

పూరన్, పంత్ బ్యాట్లు ఆడలేదు

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రిషబ్ పంత్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

బదోని, మార్క్రమ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు

పూరన్, పంత్ అవుటైన తర్వాత ఐడెన్ మార్క్రమ్, ఆయుష్ బదోని LSGని ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

డేవిడ్ మిల్లర్ బ్యాట్‌తో అద్భుతమైన ముగింపు

చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్ ముంబైపై అద్భుతంగా ముగించాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 27 పరుగులు చేశాడు.

హార్దిక్ పాండ్యా 5 వికెట్లు

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతితో విధ్వంసం సృష్టించి 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

204 పరుగుల ఛేదనలో తడబడిన MI

204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. మూడో ఓవర్లో ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ కు చేరుకున్నారు.

నమన్ ధీర్ అదిరిపోయే ఆరంభం

నమన్ ధీర్ ముంబై ఇండియన్స్ కోసం ఎదురుదాడి చేశాడు. 24 బంతుల్లో 46 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ను ఆడాడు.

సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ వృథా

సూర్యకుమార్ యాదవ్ ఛేదనలో 43 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కానీ చివరి వరకు ఆడలేకపోయాడు. దీంతో ముంబై గెలుపు కష్టమైంది.

మ్యాచ్ గెలిచిన లక్నో

బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్ చివరిలో బాగా రాణించడంతో లక్నో 12 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది.

స్మృతి మంధానా ఐపీఎల్‌లో ఎవరి ఆటను ఎక్కువగా చూస్తారో తెలుసా?

స్మృతి మంధానకు ఇష్టమైన ఆహారం ఇదేనంటా !

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ వీళ్లే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. జెర్సీ ధరెంతో తెలుసా?