business
రఘునందన్ కామత్ కర్ణాటకలోని ఒక చిన్న ఊరిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. ఆయన నాన్న పండ్లు అమ్మేవారు. జీవితం మొదట్లో చాలా కష్టాలు పడ్డారు.
మంచి జీవితం కోసం రఘునందన్ కామత్ కేవలం 15 ఏళ్ల వయసులోనే ముంబైకి వచ్చేశారు. ఆయన నాన్న అప్పటికే ఇక్కడ పండ్లు అమ్ముతున్నారు.
రఘునందన్ కామత్‌కు చదువులో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ చిన్నప్పటి నుంచే జీవితంలో ఎదగాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేది.
రఘునందన్ కామత్ తన తాతయ్య పాత షాపు తీసుకొని ఐస్ క్రీమ్ అమ్మడం మొదలు పెట్టారు. అతని అసలు ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది.
రఘునందన్ కామత్ ముంబైలోని విలే పార్లేలో నలుగురు ఉద్యోగులతో తన మొదటి షాపును స్టార్ట్ చేశారు. ఈ రోజు ఈ బ్రాండ్ దేశంలోని పెద్ద ఐస్ క్రీమ్ కంపెనీలలో ఒకటిగా ఉంది.
రఘునందన్ కామత్ మామిడి, పనస, పుచ్చకాయ వంటి పండ్ల ఫ్లేవర్లను ఐస్ క్రీమ్ లో కలపడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేశారు. ఇదే అతని స్పెషాలిటీ అయింది.
రఘునందన్ కామత్ చెప్పిన దాని ప్రకారం అతను తన ఐస్ క్రీమ్ ను ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. దాని రుచే అసలైన గుర్తింపునిచ్చింది. అదే సక్సెస్ కు దారి తీసింది.
వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ఒక షోలో అతని ఐస్ క్రీమ్ ను పొగిడినప్పుడు రఘునందన్ కామత్ తన కష్టానికి నిజమైన గుర్తింపు లభించిందని ఆనందపడ్డారట.
రఘునందన్ కామత్ కు ఈ రోజు 3 బిలియన్ రూపాయల సామ్రాజ్యం ఉంది. 135 కంటే ఎక్కువ స్టోర్లలో 125 కంటే ఎక్కువ ఐస్ క్రీమ్ ఫ్లేవర్లను కస్టమర్లకు అందిస్తున్నారు.
సంకల్పం ఉంటే, కష్టపడితే ఏదైనా సాధించొచ్చని రఘునందన్ కామత్ జీవితమే చెబుతుంది.