business
భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు కోసం ఎదురుచూపులు ముగిశాయి. భారతీయ రైల్వే పర్యావరణ అనుకూల, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి దీన్ని ప్రారంభించనుంది.
ముఖ్యంగా ఈ రైలు డీజిల్, విద్యుత్ లేకుండా కేవలం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పైనే నడుస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు ఉండవు. ఈ రైలు రూట్, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు ట్రయల్ హర్యానాలో జరుగుతుంది. ఇది జీంద్ నుండి సోనిపట్ (Jind-Sonipat) మధ్య 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా నడుస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు ఉండవు, పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. వాయు కాలుష్యం అనే సమస్యే ఉండదు.
హైడ్రోజన్ రైలు గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇది హై-స్పీడ్ రైలుగా సేవలు అందిస్తుంది. అది కూడా పర్యావరణ హితంగా.
ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసింది. ఈ రైలును భారతీయ రైల్వే స్వదేశీ సాంకేతికత ఆధారంగా తయారు చేయడం విశేషం.
ఈ హైడ్రోజన్ రైలులో మొత్తం 2638 మంది ప్రయాణించవచ్చు. ఇది ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
భారతీయ రైల్వే 2800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 35 హైడ్రోజన్ రైళ్ల తయారీని ప్రారంభించింది. అందులో ఇది మొదటి రైలు, ఇది ట్రయల్ కోసం సిద్ధంగా ఉంది.
రైల్వే ‘Hydrogen for Heritage’ ప్రాజెక్ట్ కింద కొండ ప్రాంతాలు, చారిత్రక మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను నడపాలని యోచిస్తోంది.
ప్రస్తుతం హైడ్రోజన్ రైలు ట్రయల్ నడుస్తోంది. ఇది విజయవంతం అయిన తర్వాత త్వరలోనే ప్రయాణికుల కోసం ప్రారంభిస్తారు.
భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు, గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ భారత్ మిషన్ వైపు ఒక ముందడుగు. ఈ రైలు పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవం సృష్టిస్తుంది.