business
చమురు కంపెనీలు సిలిండర్ ధరను ప్రతి నెల మారుస్తుంటాయి. ఏప్రిల్ 1, 2025న కూడా వీటిలో మార్పు ఉంటుందని సమాచారం.
ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర కూడా మారొచ్చు. దీని వల్ల విమాన టికెట్ ధర పెరుగుతుంది.
చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న యూపీఐ ఖాతాలు, ఏప్రిల్ 1 నుంచి పని చేయవు. మీరు చాలా కాలంగా దీన్ని వాడకపోతే ఇది మూతపడుతుంది.
రూపే డెబిట్ సెలెక్ట్ కార్డులో కొన్ని పెద్ద అప్‌డేట్స్ ఉంటాయని సమాచారం. దాని ప్రకారం ప్రమాదంలో మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యం సంభవించినా రూ.10 లక్షల వరకు బీమా అందుతుంది.
అద్దె ఆదాయంపై టీడీఎస్ పరిమితి 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెరుగుతుంది. ఇది కాకుండా సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై వచ్చే వడ్డీకి టీడీఎస్ పరిమితి రూ.1 లక్షకు పెరుగుతుంది.
విదేశాల్లో చదవడానికి డబ్బు పంపిస్తే టీసీఎస్ పరిమితి రూ.10 లక్షలకు పెరుగుతుంది. అదే సమయంలో డబ్బు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ దగ్గర అప్పు తీసుకుంటే టీసీఎస్ ఉండదు.
SBI, PNBతో సహా చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలో కనీస సగటు నిల్వల గురించి రూల్స్‌లో మార్పులు చేస్తున్నాయి. దాని ప్రకారం నిల్వ తక్కువగా ఉంటే జరిమానా విధిస్తారు.
ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారుల సంస్థ టోల్ ట్యాక్స్ పెంచనుంది. లాంగ్ జర్నీలు చేసే వారికి ఖర్చు పెరిగినట్టే.