Astrology
2024 లో ఎంతో మంది వాస్తు నిపుణులు వంటగదికి సంబంధించిన ఎన్నో వాస్తు చిట్కాలను చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కిచెన్ లో ఖచ్చితంగా ఎండపడాలి. ఎందుకంటే ఎండ ప్రతికూల శక్తి లేకుండా చేస్తుంది. ఇంట్లో హెల్తీ వాతావరణాన్నిసృష్టిస్తుంది. అలాగే ఇది దోషాలను తొలగిస్తుంది.
వాస్తు ప్రకారం..కిచెన్ గోడలకు లేత రంగులు అంటే లైట్ గ్రీన్ లేదా లైట్ ఎల్లో, వైట్ కలర్ ను వేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ఇంటోలో సానుకూల శక్తిని ఉంచుతుంది.
కిచెన్ రూం చిన్నగా ఉండటంతో చాలా మంది గ్యాస్ స్టవ్ మీదే గీజర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది వాస్తు నిపుణులు దీని సరైన దిశ గురించి వివరించారు.
ఈ రోజుల్లో చాలా మంది కిచెన్ స్లాబ్ మీదే రొట్టెలు, చపాతీలు చేస్తున్నారు. కానీ వాస్తు నిపుణులు ఇలా చేయొద్దని, ఇది వాస్తు దోషం కలిగిస్తుందని చెప్పారు.
వాస్తు ప్రకారం..కిచెన్ రూం సరైన దిశలో అంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఈ దిశలో కిచెన్ రూం ఉంటే ఇంట్లో సుఖశాంతులు, సంపదలు నెలకొంటాయి.