Astrology
వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ ఇంటి శక్తికి కేంద్రం. వంట చేసే విధానం మన జీవితంపై మంచి, చెడు ప్రభావాలను చూపుతుందట.
చపాతీ చేసే పద్ధతి వాస్తుతో ముడిపడి ఉంటుంది. కొందరు చపాతీ పీటపై చేస్తారు. మరికొందరు నేరుగా కిచెన్ స్లాబ్‌పై చేస్తారు.
చపాతీ పీట, కర్ర రాహు-కేతువులతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని సరిగ్గా వాడితే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. లేదంటే నెగెటివ్ ఎఫెక్ట్స్ వస్తాయట.
చపాతీ పీట లేకుండా చపాతీ చేయడం మంచిది కాదట. డబ్బు నష్టం, ఇంట్లో గొడవలు, రాహు-కేతువుల ప్రభావం పెరుగుతుందట.
స్లాబ్‌పై చపాతీ చేయాలంటే అది శుభ్రంగా ఉండాలి. మురికిగా ఉంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చపాతీ చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కుకు తిరిగి ఉండాలి. ఈ దిశలు పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
చెక్క లేదా మట్టితో చేసిన చపాతీ పీట మంచిది. రాయి లేదా నేరుగా స్లాబ్‌పై చేస్తే పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
స్లాబ్‌పై రోటీ చేయాల్సి వస్తే కొన్ని చిట్కాలు పాటించి వాస్తు దోషం తగ్గించవచ్చు. రాగి నాణెం పెట్టడం, పసుపు చల్లడం లేదా దీపం వెలిగించడం.