video:పేకాటలో లక్షల సంపాదన... మహిళా ఐఎఎస్ వద్ద యువకుడి వింత కోరిక

video:పేకాటలో లక్షల సంపాదన... మహిళా ఐఎఎస్ వద్ద యువకుడి వింత కోరిక

Published : Oct 29, 2019, 06:18 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో  జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ యువకుడి వింత కోరికను మహిళా ఐఎఎస్ ముందుంచాడు. అందుకోసం అధికారికంగా ఆర్జీ కూడా పెట్టుకున్నాడు.  

చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి చెందిన కొమ్మద్ది బావాజీ(24) పేద కుటుంబంలో పుట్టాడు. అతడికి చదువు అబ్బకపోయినా తెలివైన కుర్రాడు. అయితే ఆ తెలివిని మంచి పనులకు ఉపయోగించకుండా అతడు జూదంలో ఉపయోగించాడు. 12వ ఏటనే పేకాటలో ప్రావిణ్యం సంపాదించిన అతడు ప్రస్తుతం అందులో మాస్టర్ గా మారాడు. ఎంతలా అంటే ప్లేయింగ్ కార్డ్స్(పేక ముక్కలు) చూడగానే ఆ కార్డు ఏమిటో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇదే ప్రావీణ్యం జూదంలో ప్రదర్శిస్తూ లెక్కకు మించి డబ్బు సంపాదించానని అంటున్నాడు. 

అయితే మదనపల్లెలో సబ్ కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతిస్పందన కార్యక్రమంలో అతడు ఓ వింతైన అర్జీ పెట్టుకున్నాడు. యువ ఐఎఎస్ అధికారిణి, మదనపల్లె సబ్ కలెక్టరు చెరుకూరి కీర్తి ముందే పేక ముక్కలతో తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించి...చివరకు తన ఆలోచనను ఆమెకు తెలియజేశాడు.  తన వల్ల ఓడిపోయిన కుటుంబాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మారాలనుకుంటున్నానని.. ఏ పనీ చేయలేని తాను ఈ సమాజానికి ఏదైనా కొంచెం చేయాలని ఆశిస్తూ అవయవ దానం చేయాలనుకుంటున్నానని అధికారులకు తెలియజేసి అనుమతి కోరాడు.   
 

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?