కారు పార్క్ చేసి అలా వెళ్ళాడో లేదో అంతలోనే...

Nov 26, 2019, 6:40 PM IST

చిత్తూరు జిల్లాలో భారీ దోపిడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి రూ10 లక్షల నగదు దోపిడి చేశారు దొంగలు. హోసూరు సమీపంలోని వేపనపల్లి వద్ద కారు అద్దాలు పగలగొట్టి  నగదు ఎత్తుకెళ్ళారు దొంగలు. సంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హోసూరు సమీపంలోని వేపనపల్లి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాడు. కారును నిలిపి  రిజిస్టర్ కార్యాలయం లోపలి వెళ్ళిన సమయంలో ఘటన జరిగింది.