యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా నిలిచింది.
కరోనా విజృంభణ సమయంలో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా సత్తా చాటింది. ఈ టోర్నమెంట్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన ఒసాకా మహిళల సింగిల్స్ ను కైవలం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్ కకు చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకాను చిత్తు చేసి రెండో యూఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది ఒసాకా.
ఈ టోర్నీ మొత్తంలోనూ అదరగొట్టిన ఒసాకా ఫైనల్ ఆరంభంలో కాస్త తడబడింది. దీంతో తొలి సెట్ ను అజరెంకా గెలుచుకుంది. అయితే ఆ తర్వాత పుంజుకున్న ఒసాకా అటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలా చివరి రెండు సెట్లను గెలుచుకుని విజేతగా నిలిచింది. ఉత్కఠభరితంగా గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాను చిత్తు చేసి రెండోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఇలా ఇప్పటివరకు ఒసాకా మూడు గ్రాండ్ స్లామ్ లను గెలుచుకుంది. అందులో ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ కాగా మిగతా రెండు యూఎస్ ఓపెన్లు. 2018లో యూఎస్, 2019 ఆస్ట్రేలియన్, 2020 లో మళ్లీ యూఎస్ ఓపెన్ ఇలా వరుసగా మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించిన ఈ జపాన్ క్రీడాకారిణి.