French Open 2022: ఇటీవలి కాలంలో అమెరికాలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న గన్ కల్చర్, వరుస మారణహోమాలపై యూఎస్ కు చెందిన యువ టెన్నిస్ సంచలనం కోకో గాఫ్ తనదైన శైలిలో స్పందించింది.
అగ్రరాజ్యం అమెరికాలో అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న తుపాకీ సంస్కృతిపై ఆ దేశానికి చెందిన యువ టెన్నిస్ సంచలనం, ఫ్రెంచ్ ఓపెన్-2022 లో మహిళల సింగిల్స్ లో ఫైనల్స్ కు చేరిన కోకోగాఫ్ తనదైన శైలిలో స్పందించింది. 18 ఏండ్ల కోకో గాఫ్.. గురువారం జరిగిన సెమీస్ లో 6-3, 6-1తో ట్రెవిసన్ (ఇటలీ)ని చిత్తు చేసింది. కీలక పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస సెట్లలో విజయం సాధించింది. శనివారం జరుగబోయే ఫైనల్ లో ఆమె పోలండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ తో తలపడనుంది. స్వైటెక్ 2020 లో టైటిల్ గెలిచి రెండో టైటిల్ కోసం పోటీ పడుతుండగా.. గాఫ్ కు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్.
18వ ర్యాంకర్ అయిన కోకో గాఫ్ మ్యాచ్ అనంతరం.. వీడియో కెమెరా ముందు బిగించిన అద్దం వద్దకు వచ్చి.. ‘గన్ వయిలెన్స్ ను శాంతి తో అంతం చేద్దాం..’ అని రాసింది.ఆమె రాసింది మూడు పదాలే అయినా గన్ కల్చర్ పై కోకో గాఫ్ వైఖరి తెలియజెప్పింది. మ్యాచ్ అనంతరం ఆమె ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘అవును. నేను గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరాను. కానీ ప్రపంచంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర క్షోభకు గురి చేస్తున్నాయి.
undefined
Peace
End gun violence
❤️ Coco
After advancing to the French Open final, Coco Gauff wrote this message on the camera. pic.twitter.com/PgbYHbSxfW
ముఖ్యంగా యూఎస్ లో.. అయితే ఇప్పుడు ఈ టెన్నిస్ మ్యాచ్ లో దాని గురించి మాట్లాడటం అంత ముఖ్యం కాదని నేను భావిస్తున్నాను..’ అని తెలిపింది. అమెరికాలో ఓక్లహోమాలోని తుల్సాలోని ఓ ఆస్పత్రిలోకి చొరబడిన దుండగుడు నలుగురిని హతమార్చాడు. ఈ వార్త వెలువడిన వెంటనే కోకో గాఫ్ పై విధంగా స్పందించింది.
Keeping it real with ✌ pic.twitter.com/ofFQG4CIlt
— Roland-Garros (@rolandgarros)కాగా వారం రోజుల క్రితం టెక్సాస్ లోని ఓ పాఠశాల లోకి చొరబడిన ఓ యువకుడు క్లాస్ లో పిల్లలు, ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మరణించారు.