ఫెడ్ కప్ హార్ట్ విజేతగా సానియా రికార్డ్... ప్రైజ్ మనీ ఏం చేసిందంటే...

By telugu news teamFirst Published May 12, 2020, 10:02 AM IST
Highlights

మొత్తం ఓట్లలో 60 శాతం సానియాకు రావడం.. ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న ప్రజాదరణకు నిదర్శనం. కాగా.. విజేతగా గెలిచినందుకు ఆమెకు 1.5లక్షల నగదు బహుమతి అందజేశారు.

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును భారత ఏస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కైవసం చేసుకుంది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి సానియా ఈ అవార్డుకు ఎంపికైంది.దీంత ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కింది. 

ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు జ‌రిగిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో 16985 మంది పాల్గొన‌గా 10 వేల  పైచిలుకు ఓట్ల‌తో ఆసియా ప‌సిఫిక్ జోన్‌లో ఉన్న సానియా విజేత‌గా నిలిచింది. మొత్తం ఓట్లలో 60 శాతం సానియాకు రావడం.. ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న ప్రజాదరణకు నిదర్శనం. కాగా.. విజేతగా గెలిచినందుకు ఆమెకు 1.5లక్షల నగదు బహుమతి అందజేశారు.

విజేత‌కు ఇచ్చే రూ. 1.5 ల‌క్ష‌ల‌ను ఆమె తెలంగాణ సీఎం స‌హాయ నిధికి పంపించింది.దాదాపు రెండేళ్ల త‌ర్వాత ఫెడ్‌క‌ప్‌లో పున‌రాగ‌మ‌నం చేసిన సానియా.. భార‌త్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చ‌డంలో కీల‌క‌పాత్ర పోషించింది. సానియా అంత‌ర్జాతీయ కెరీర్‌లో ఆరు డ‌బుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. అలాగే గ‌తంలో ఆమె మ‌హిళ‌ల డ‌బుల్స్ నెం.1 ర్యాంకులో కూడా నిలిచింది. త‌న‌కు ద‌క్కిన సంద‌ర్భంగా సానియా సంతోషం వ్యక్తం చేశారు.

‘అవార్డును గెలచుకున్న తొలి భారతీయురాలినైనందుకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు దేశానికి నా అభిమానులందరికి అంకితమిస్తున్నాను.నాకు ఓటేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని అవార్డులు తీసుకొస్తానని ఆశిస్తున్నా.'అని సానియా పేర్కొన్నారు.

'యావత్ ప్రపంచం ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ ప్రైజ్‌మనీని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నా.'అని సానియా తెలిపింది.

click me!