ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అంకితా రైనా సంచలనం... సానియా మీర్జా తర్వాత గ్రాండ్‌స్లామ్‌...

By team teluguFirst Published Feb 8, 2021, 9:35 AM IST
Highlights

నిరుపమ వైద్యనాథన్, సానియా మీర్జా తర్వాత గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రా సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డు...

ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా తర్వాత ఈ ఫీట్ సాధించిన అంకితా రైనా...

భారత యువ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనా సంచలనం క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్ ఈవెంట్‌లో మెయిన్ డ్రా సాధించిన అంకితా రైనా... ఈ ఫీట్ సాధించిన మూడో భారత వుమెన్ ప్లేయర్‌గా నిలిచింది. ఇంతకుముందు నిరుపమ వైద్యనాథన్, సానియా మీర్జా మాత్రమే భారత్ తరుపున గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాస్ సాధించారు. 

మహిళల సింగిల్స్‌లో మెయిన్ డ్రా సాధించలేకపోయిన అంకితా రైనా, లక్కీ లూజర్‌గా రొమానియా ప్లేయర్ మెహిలా బుజర్‌నెక్‌తో కలిసి డైరెక్ట్ ఎంట్రీ సాధించింది. 1998లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మొట్టమొదటి మెయిన్ డ్రా సాధించింది నిరుపమా.

ఆమె తర్వాత ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఫీట్ సాధించింది. సానియా మీర్జా తర్వాత గ్రాండ్ స్లామ్‌లో మెయిన్ డ్రా సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచింది 28 ఏళ్ల అంకితా రైనా.

click me!