Xiaomi's Mega Event: షియోమీ 12ప్రొ 5జి నుండి టి‌వి, ట్యాబ్ వరకు లాంచ్.. లైవ్ ఈవెంట్‌ ఎలా చూడాలంటే..?

By asianet news telugu  |  First Published Apr 27, 2022, 12:40 PM IST

షియోమీ 12 ప్రొ 5జి, షియోమీ పాడ్ 5, షియోమీ స్మార్ట్ టి‌వి 5ఏ లాంచ్ ఇండియా ఈరోజు మధ్యాహ్నం  లాంచ్ కానున్నాయి. ఈ ఈవెంట్ షియోమీ  సోషల్ మీడియా హ్యాండిల్, యుట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
 


ఈరోజు అంటే ఏప్రిల్ 27న షియోమీ భారతదేశంలో ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. షియోమీ ఈ ఈవెంట్‌లో షియోమీ 12 ప్రొ 5జి, షియోమీ పాడ్ 5, షియోమీ స్మార్ట్ టి‌వి 5ఏ వంటి ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. షియోమీ 12ప్రొ 5జి గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో షియోమీ 12, షియోమీ 12Xతో పాటు లాంచ్ చేయబడింది. షియోమీ పాడ్ 5 లాంచ్ కూడా గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. షియోమీ స్మార్ట్ TV 5ఏ భారతదేశంలో కూడా ఇంతకుముందు లాంచ్ అయ్యాయి అయితే ఇప్పుడు ఈ సిరీస్ కింద కొత్త మోడల్‌లు ప్రవేశపెట్టనుంది. ఈ ఈవెంట్ Xiaomi సోషల్ మీడియా హ్యాండిల్ అండ్ YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

షియోమీ 12 ప్రొ 5G ధరకు సంబంధించి బేస్ వేరియంట్ రూ. 65,000 ధరతో విడుదల చేయనుంది. షియోమీ 12 ప్రో ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీనికి 5G సపోర్ట్ లభిస్తుంది. అంత్తేకాకుండా, MIUI 13 ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ 1,500 నిట్‌ల బ్రైట్ నెస్ తో 6.73-అంగుళాల WQHD + డిస్‌ప్లే  పొందుతుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ జెన్ 1 ప్రాసెసర్‌తో 12జి‌బి LPDDR5 ర్యామ్, మూడు వెనుక కెమెరాలు ఉంటాయి, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్ Sony IMX707 సెన్సార్‌గా ఉంటుంది.

Latest Videos

undefined

షియోమీ ప్యాడ్ 5 ధర సుమారు రూ. 30,000,  బేస్ వేరియంట్ ధర అంటే 6జి‌బి ర్యామ్ తో 128జి‌బి మోడల్‌గా ఉంటుంది. షియోమీ పాడ్ 5 గ్లోబల్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ కానుంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 ట్యాబ్‌లో ఇచ్చారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల WQHD + డిస్‌ప్లే పొందుతుంది. దీనితో డాల్బీ విజన్ అండ్ హెచ్‌డిఆర్ 10కి సపోర్ట్ లభిస్తుంది. దీనితో పాటు ఫేస్ అన్‌లాక్, స్ప్లిట్ స్క్రీన్ వంటి మల్టీ-టాస్కింగ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఈ ట్యాబ్‌లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ తో వస్తుంది, దీనితో 6జి‌బి LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఈవెంట్‌లో Xiaomi స్మార్ట్ టీవీ 5A కూడా లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ టీవీని మూడు సైజులు, పాత మోడల్ కంటే ఎక్కువ ర్యామ్, స్టోరేజ్‌తో విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

click me!