ఈ ఏడాది గూగుల్ లో వెతికిన పదాలు ఇవే..

By ramya neerukondaFirst Published Dec 18, 2018, 3:41 PM IST
Highlights

సోషల్ మీడియా అప్లికేషన్ విషయానికి వస్తే.. Instagram గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట. దీనిని బట్టి Instagram వాడే వారి సంఖ్య ఎంతలా పెరిగిందో తెలిసిపోతోంది.


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి తెలియని వాళ్లు ఎవరైనా ఉంటారా..? ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. అందరూ చేసే మొదటి పని గూగుల్ లో సెర్చ్ చేయడం. అలా గూగుల్ లో సెర్చ్ చేయగానే.. దానికి సంబంధించిన సమాచారం మన కళ్ల ముందు ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో మనమందరం నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కాబట్టి.. ఈ 2018లో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పదాలేంటి..? దేని గురించి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపించారో.. ఇప్పుడు మనము ఒక లుక్కేద్దాం...

తాజాగా గూగుల్ కంపెనీ.. 2018లో ఎక్కువగా నెటిజన్లు వెతికిన పదాల జాబితాను విడుదల చేసింది. మొబైల్ అప్లికేషన్ విభాగంలో అధిక శాతం మంది యూట్యూబ్, వాట్సాప్ అప్లికేషన్ల గురించి వెతికారు. ఇక సోషల్ మీడియా అప్లికేషన్ విషయానికి వస్తే.. Instagram గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట. దీనిని బట్టి Instagram వాడే వారి సంఖ్య ఎంతలా పెరిగిందో తెలిసిపోతోంది.

ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల విషయానికి వస్తే, మార్కెట్లో ఉన్న మిగతా వాటితో పోలిస్తే Netflixని ఎక్కువమంది వెదకడం మొదలుపెట్టారు. డిటిహెచ్ సేవల విషయానికి వస్తే,  అధిక శాతం మంది Airtel DTH సర్వీస్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు.

ఇక  గేమ్స్ విషయానికి వస్తే ... ఈ మధ్యకాలంలో బాగా పాపులరైన pubg గేమ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపించారు. దీని తర్వాత క్రికెట్, ఐపీఎల్ , ఫిఫా గురించి ఎక్కువగా వెతికారు.

సెలబ్రెటీల విషయానికి వస్తే.. ప్రియావారియర్ గురించి, ప్రియాంక చొప్రా పెళ్లి గురించి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపించారు. సినిమాల విషయానికి వస్తే.. రోబో 2.వో, ధడక్, టైగర్ జిందా హై, భాగీ2 సినిమాల గురించి ఎక్కువగా వెతికారు. వీటితోపాటు రజినీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి నటుల పేర్లు కూడా ఎక్కువగానే వెతికారు.ఇవి కాకుండా statue of unity, kiki challenge ల గురించి గూగుల్ లో ఎక్కువగా శోధించారు. 

click me!