భారత్ మార్కెట్లోకి ‘వన్ ప్లస్’ మెక్ లారెన్.. 26 వరకూ ఆఫర్లు

By sivanagaprasad kodatiFirst Published Dec 16, 2018, 11:02 AM IST
Highlights

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్ 6టీ’ మెక్ లారెన్ మోడల్ ఫోన్లను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెల 26 వరకు పలు రకాల ఆఫర్లను కూడా ప్రకటించింది వన్ ప్లస్. 

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్తమోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత విపణిలోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ 6టీ సిరీస్‌లో మెక్‌లారెన్‌ ఎడిషన్‌ను సంస్థ విడుదల చేసింది. మెక్‌లారెన్‌ బ్రాండ్‌ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్‌లో 10జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అదనపు ఫీచర్లు. దీంతో పాటు నాచ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌ మరో స్పెషాలిటీ.

భారత్‌లో దీని ధర రూ. 50,999గా నిర్ణయించారు. సాధారణ వన్‌ప్లస్‌ 6టీ (8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌) ధర రూ. 45,999 కంటే మెక్‌లారెన్‌ ఎడిషన్‌ వన్‌ప్లస్‌ 6టీ ధర ఎక్కువ. ఈ ఫోన్ విక్రయాలు శనివారం నుంచే మొదలయ్యాయి. అమెజాన్‌ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్లలో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఆఫ్‌లైన్‌లో వన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చునని పేర్కొన్నది.  

మార్కెట్లోకి ఫోన్‌ విడుదల చేయడంతోపాటు సంస్థ యాజమాన్యం కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. వన్‌ప్లస్‌ 6టీ మెక్‌లారెన్‌ ఎడిషన్‌తో పాటు ఇతర వన్‌ప్లస్‌ 6టీ వేరియంట్లపై ఈ నెల 24వ తేదీ వరకు వరకు ఆఫర్లు ఇస్తోంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 2000 క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులతో ఒకేసారి డబ్బు చెల్లించి కొనుగోలు చేసే వారికి రూ. 1,500 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. దీంతో పాటు పాత వన్‌ప్లస్‌ ఫోన్లను ఎక్స్ఛేంజ్‌ చేసిన వారానికి రూ. 3000 డిస్కౌంట్‌ కూడా ఉంటుంది.

వన్‌ప్లస్‌ 6టీ మెక్‌లారెన్‌ ఫోన్ లో లభించే ఫీచర్లివే: 
6.41 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ నాచ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 9.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తోపాటు ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845ఎస్ఓసీ ప్రాసెసర్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 10జీబీ ర్యామ్‌ సామర్థ్యం కాగా, అంతర్గతంగా  256జీబీ మెమొరీ చేయగల కెపాసిటీ ఉంటుంది. వెనుకవైపు 16మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు, ముందువైపు 16మెగాపిక్సెల్‌ కెమెరాతోపాటు 3,700ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్‌లో అదనపు ఆకర్షణ కానున్నాయి. 
 

click me!