విడుదలకు ముందే నూతన స్మార్ట్ ఫోన్ మోడల్ స్పెసిఫికేషన్లు లీక్

By Arun Kumar P  |  First Published Jan 26, 2019, 1:34 PM IST

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా సంస్థను చైనా టెక్ దిగ్గజం ‘లెనెవో’ స్వాధీనం చేసుకున్నది. కైవశం తర్వాత తాజాగా మోటో జీ7 పేరిట మరో నూతన స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల ఏడో తేదీన విడుదల చేసేందుకు సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అయితే ముందుగానే జీ 7 ఫోన్ స్పెసిఫికేషన్స్ లీకవ్వడం గమనార్హం. 
 


శాన్‌ఫ్రాన్సిస్కో: స్మార్ట్ ఫోన్ల తయారీలో విరామానికి తెర పడింది. మళ్లీ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలన్నీ నూతన మోడల్ ఫోన్లను మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువావే అనుబంధ బ్రాండ్ హానర్.. హానర్ వ్యూ 20ని ఆవిష్కరించింది.

అదే చైనాకు చెందిన మరో టెక్ డిగ్గజం లెనోవో సొంతమైన మోటొరోలా వచ్చే నెల ఏడో తేదీన మోటో జీ7, జీ7 ప్లస్, జీ7 పవర్, జీ7 ప్లే స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయబోతోంది. కానీ ఆవిష్కరణకు రెండు వారాల ముందే ఓ బ్రెజిలియన్ వెబ్‌సైట్ పొరపాటున మోటో జీ7 స్పెసిఫికేషన్లను బయటపెట్టేసింది. 

Latest Videos

undefined

లీకైన వివరాలను బట్టి మోటో జీ7లో 6.24 అంగుళాల వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే, 1080x2270 పిక్సెల్స్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 632 చిప్‌సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

గతేడాది మార్కెట్లోకి విడుదలైన జీ6 మోడల్ ఫోన్ తరహాలోనే జీ7 కూడా ఉంటుంది. ఏడాదికోసారి స్మార్ట్ ఫోన్లను అప్ డేట్ చేస్తున్న సంస్థల్లో మోటరోలా కూడా ఒకటి. అంతేకాదు మోటరోలా ఫోన్లు చౌకధరకే వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఆండ్రాయిడ్ సేవలు కూడా తేలికే. అయితే తాజాగా విడుదల కానున్న జీ7 ఫోన్ ధర మాత్రం సంస్థ మార్కెట్లోకి విడుదల చేశాక వెల్లడయ్యే అవకాశం ఉంది. 

మిగతా జీ 7 ఫోన్లు జీ7 ప్లే, జీ7 పవర్, జీ7 ప్లస్ ఫోన్లలో స్పెసిఫికేషన్లు అన్నీ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.  ప్లే, పవర్‌ ఫోన్లలో రిజల్యూషన్ డిస్‌ప్లే కొంత తక్కువగా ఉన్నా 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని ఉపయోగించారు. హువావే సంస్థ వాడుతున్న బ్యాటరీ ఆప్షన్లన్నీ వీటిల్లోనూ లభ్యం అవుతాయి. తాజా నాలుగు రకాల మోటో జీ7 ఫోన్లన్నీ హెడ్ ఫోన్ జాక్, మైక్రో ఎస్డీని కలిగి ఉంటాయి. 
 

click me!