8న మార్కెట్లోకి ‘హానర్8ఏ’

By sivanagaprasad kodatiFirst Published Jan 4, 2019, 9:04 AM IST
Highlights

చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హువేయి అనుబంధ సంస్థ హానర్ సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీన చైనా మార్కెట్లో ఆనర్ 8ఏ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టనుంది

చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హువేయి అనుబంధ సంస్థ హానర్ సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీన చైనా మార్కెట్లో ఆనర్ 8ఏ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టనుంది.

స్టీరియో స్పీకర్లు, వాటర్ డ్రాప్- స్టైల్ డిస్ప్లే గల ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఆనర్ ఫోన్ టీజర్ ఫోటోను అధికారిక వెబ్సైట్లో పోస్టు చేశారు. ఆనర్ 8ఏ ఫోన్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 32జీబీ, 64జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీకార్డు, ఫేస్ అన్లాక్ ఫీచర్, 2,920ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆనర్ 8ఏ ఫోన్ ధర రూ. 8,999గా నిర్ణయించారు.

మార్కెట్లోకి నోకియా ఫీచర్ ఫోన్  
ముంబై: నోకియా వినియోగదారులకు హెచ్ఎండీ గ్లోబర్ శుభవార్త అందించింది. నోకియా  ఫీచర్స్ 106 ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా నోకియా ఫీచర్ ఫోన్ కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

నోకియా  ఫీచర్స్ 106 ఫోన్ ధర రూ. 1,299 ఉంటుందని కంపెనీ తెలిపింది. డార్క్ గ్రే రంగు వేరియంట్లో ఈ ఫోన్ రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. గత నెలలో నోకియా 8.1 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. నోకియా ఫీచర్స్ 106 ఫోన్ బుక్ చేసుకున్న కస్టమర్లకు 21 రోజుల్లో ఈ ఫోన్ పంపిణి చేస్తామని సంస్థ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 15 గంటలు మాట్లాడుకోవచ్చు.

click me!