ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కూల్3 పేరుతో విడుదచేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.5,999కే కూల్ ప్యాడ్ వినియోగదారులకు అందిస్తోంది. ధర తక్కువగా వుందని ఫీచర్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని... మధ్యతరగతి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకే ఈ ఫోన్ ను రూపొందించినట్లు కూల్ ప్యాడ్ ప్రతినిధులు తెలిపారు.

కూల్3 మోడల్‌లో 5.71 ఇంచుల డిస్‌ప్లేతో వినియోగదారులకు సౌకర్యవంతవంగా వుండేలా రూపొందించామన్నారు. అలాగే అత్యాధునిక ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ ను ఇందులో వాడినట్లు తెలిపారు. ఇక కెమెరా విషయాని వస్తే వెనుక భాగంలో రెండు కెమెరాలు( 8,0.3 మెగాపిక్సల్), ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాను అందించినట్లు తెలిపారు.
ఇక 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ సదుపాయాలను ఈ కూల్3 స్మార్ట్ ఫోన్లో అందించారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. ఇందులో 3000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీని వాడారు.
ఈ కూల్3 ఫోన్ నాలుగు కలర్ వేరియెంట్ల (బిడ్‌నైట్ బ్లూ, రూబీ బ్లాక్, ఓషియన్ ఇండిగో, టీల్ గ్రీన్) మార్కెట్లో అందుబాటులోకి వుంది. ఇలా అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.5,999 ధరకు అందిస్తుండటంతో వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది.