ఐటీ రంగం ఇక ‘బుల్’ పరుగులే.. ఆర్నెల్లలో కొలువుల జాతరే

By sivanagaprasad kodati  |  First Published Oct 30, 2018, 9:00 AM IST

ఐటీ విద్యార్థులకు మంచి రోజులు రానున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఐటీ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టనున్నాయి. జూనియర్ లెవల్ స్థాయి నుంచి తీసుకున్నా క్రియేటివిటీకి, క్రిటికల్ థింకింగ్ చేసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.


వచ్చే ఆరు నెలల్లో ఐటీ రంగంలో సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పలు ఐటీ కంపెనీలు ప్రధానంగా జూనియర్‌ లెవెల్‌ ఉద్యోగాలను భారీగా నియమిస్తాయని ఎక్స్పెరిస్‌ ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే వెల్లడించింది.

అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణల నేపథ్యంలో భారత్‌లో కొద్దినెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది.  రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.

Latest Videos

undefined

భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్‌ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్‌ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్‌ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టిసారించాయి.

ఐటీ కంపెనీలు భారీ వడపోతల అనంతరం జూనియర్‌ లెవెల్‌లో నియామకాలను పెద్దఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనాధోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక పేర్కొంది.

మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌చైన్‌, రోబోటిక్స్‌ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్‌ ప్రణాళికలను ఎక్స్పెరిస్‌ ఐటీ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే విశ్లేషించింది. 

53 శాతం నియామకాలు ఉ:టాయని ఈ సర్వే అంచనా వేసింది. ఐటీయేతర సంస్థలు సైతం డిజిటల్ పరివర్తన దిశగా ప్రయాణం చేసేందుకు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి.

క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. భారతదేశంలో ఐటీ ఉద్యోగ నియామకాల్లో స్టార్టప్ లు కీలక భూమిక పోషిస్తున్నాయని సదరు సర్వే నిగ్గు తేల్చింది. ప్రస్తుతం నియామకాల కోసం డిమాండ్ పెరుగుతున్నదని కూడా తెలిపింది. 


 

click me!