జూమ్‌ యాప్‌ను కాపీ చేసిందంటు జియోమీట్‌పై ఫైర్‌.. చట్టపరమైన చర్యలకు సిద్ధం..

By Sandra Ashok Kumar  |  First Published Jul 10, 2020, 12:54 PM IST

 జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే మాట్లాడుతూ, ఈ రెండు యాప్‌ల మధ్య ఒకే విధమైన ఫీచర్లను చూసి తాను షాక్‌కు గురయ్యానని, దీనిపై అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయని ఒక  నివేదిక పేర్కొంది. 


గత వారం ప్రారంభించిన రిలయన్స్ జియో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియోమీట్‌పై జూమ్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే మాట్లాడుతూ, ఈ రెండు యాప్‌ల మధ్య ఒకే విధమైన ఫీచర్లను చూసి తాను షాక్‌కు గురయ్యానని, దీనిపై అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయని ఒక  నివేదిక పేర్కొంది.

జియోమీట్‌పై కేసు వేయడంపై సమీర్  రాజే నేరుగా స్పందించకపోయినా దీనిపై తమ న్యాయ విభాగం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. "జియోమీట్‌ యాప్ వస్తోందని మాకు ముందే తెలుసు. జియోమీట్‌ లాంటి యాప్స్ తో పోటీని ఎదుర్కోవడం జూమ్ యాప్ కు ఇదే మొదటిసారి కాదు.

Latest Videos

undefined

మా ఉత్పత్తులు, సాంకేతికతే మా బలం, మా దృష్టి మొత్తం వినియోగదారులకు మెరుగైన సేవలందించడంపైనే ఉంది.”అని సమీర్ రాజే  అన్నారు. జూమ్, జియోమీట్ యాప్స్ మధ్య ఉన్న పోలికలను ఆయన ఎత్తి చూపారు.దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందటంతో, చాలా మంది వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ లను ఆశ్రయించారు.

ఎక్కువగా డౌన్‌లోడ్ కలిగిన యాప్స్ లలో ఒకటిగా జూమ్ నిలిచింది. జూమ్ బృందం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని సమీర్ రాజే చెప్పారు. జూమ్  డేటా సెంటర్ల గురించి సాంకేతిక సమాచారం పై చర్చించనున్నట్లు ఆయన ధృవీకరించారు.

also read 

"మేము  ఎవరితోనూ డేటాను పంచుకోవడం లేదు, మేము మా ప్లాట్‌ఫాంపై సాంకేతిక అంశాలను, ఎలా ఆపరేట్‌ చేయాలనే వివరాలను పంచుకుంటున్నాము " అని అతను చెప్పాడు. భారత్, చైనా మధ్య గాల్వన్ లోయ జరిగిన ఘర్షణ నేపథ్యంలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గత వారం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.

చైనీస్ యాప్స్ నిషేధం తరువాత, అనేక ఇండియన్ యాప్స్ కి డౌన్‌లోడ్‌లు పేరిగాయి. జియోమీట్ ప్రారంభించిన వారంలోనే 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను రికార్డ్ చేసింది. జూమ్ యాప్ చైనాకు  చెందినదని ప్రజలు భావిస్తున్నారని, డేటాను పొరుగు దేశాలతో పంచుపంచుకుంటున్నారని  ఇలాంటి అవాస్తవాలపై స్పందిస్తూ "జూమ్ యాప్ ఒక అమెరికన్ సంస్థ, మేము ఏ ప్రభుత్వంతోనూ డేటాను పంచుకోవట్లేదు. మాకు భారతదేశంలో రెండు డేటా సెంటర్లు ఉన్నాయి "అని సమీర్‌  రాజే అన్నారు.

click me!