యూ-ట్యూబ్ కొత్త ఫీచర్...ఇకపై ఆన్ లైన్ పేమెంట్లు కూడా...

By Sandra Ashok Kumar  |  First Published Apr 21, 2020, 11:18 AM IST

ఇప్పటికే గూగుల్ పే పేరిట ఆన్ లైన్ చెల్లింపులకు వెసులుబాటు కల్పిస్తున్న సెర్చింజన్ గూగుల్.. తాజాగా డెబిట్ కార్డు తెచ్చే సన్నాహాల్లో ఉంది. మరోవైపు యూ-ట్యూబ్ సైతం యూపీఏ చెల్లింపుల వ్యవస్థలో చేరిపోయింది.


న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌తోపాటు ఆర్థిక సేవల్లోనూ దూసుకు వెళుతున్న సెర్చింజన్ గూగుల్‌.. త్వరలో స్మార్ట్‌ డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చే సన్నాహాల్ో ఉన్నది. ప్రస్తుతం‘గూగుల్‌ పే’ పేరుతో మొబైల్‌ వ్యాలెట్‌ సేవలందిస్తున్న సంస్థ.. దీనికి అనుసంధానంగా డెబిట్‌ కార్డును కూడా వేశపెట్టాలనుకుంటోంది. దీనికి గూగుల్‌ కార్డ్‌గా నామకరణం చేయనున్నట్లు తలుస్తోంది.

ఈ గూగుల్ కార్డు ఫిజికల్‌గానే కాకుండా వర్చువల్‌గానూ అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఫిజికల్‌ కార్డుతో రిటైల్‌ విక్రయ కేంద్రాల వద్ద చెల్లింపులు జరపవచ్చు. కాంటాక్ట్‌లెస్‌ (ఎన్‌ఎఫ్సీ) పేమెంట్‌ ఆప్షన్‌ కూడా కల్పించే అవకాశాలు ఉన్నట్లు వినికిడి. ఈ కార్డు నుపయోగించి గానీ, మొబైల్ ఫోన్‌లో ఆన్ లైన్ ద్వారా గానీ కొనుగోళ్లు జరుపొచ్చు. 

Latest Videos

undefined

గూగుల్ డెబిట్ కార్డు గూగుల్ యాప్‌కు అనుసంధానమై ఉంటుంది. ఖాతాలో నగదు నిల్వల వివరాలను చెక్ చేసుకోవడానికి, వాటికి లాక్ చేయడానికి వీలవుతుంది కూడా. ఈ కార్డు తయారీలో సిటీ, స్టాన్ ఫర్డ్ ఫెడరల్ క్రెడిట్ యూనియన్ సహ భాగస్వాములుగా ఉన్నాయి. 

also read  అదరగొట్టిన ఇన్ఫోసిస్‌: ఉద్యోగులకు భరోసా...కొలువుల కోతపై క్లారీటి...


మరోవైపు సోషల్ మీడియా వేదిక యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో కొత్త చెల్లింపు విధానంగా యూపీఐని ప్రవేశపెట్టింది. ఫలితంగా యూట్యూబ్ వినియోగదారులకు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాంలో సూపర్‌చాట్, మూవీ రెంటల్స్ తదితర లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. 

యూట్యూబ్‌కు జరిపే వ్యక్తులు ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి చెల్లిస్తున్నారు. ఇకపై యూపీఐ ఐడీలను ఉపయోగించి తమ బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలను సులభంగా పూర్తిచేయవచ్చు. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లకు ఈ కొత్త విధానాన్ని యూజర్లు ఉపయోగించుకోవచ్చు.

యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్న యూజర్లు అందరూ ఇప్పుడు ఈ సరికొత్త యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం కోసం నెలవారీ లేదంటే, త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. 

వారికి ఇష్టమైన సినిమాలను కొనుక్కోవచ్చని, లేదంటే అద్దెకు తీసుకొవచ్చని యూ ట్యూబ్ వివరించింది. అలాగే, తమ అభిమాన యూట్యూబ్ క్రియేటర్లతో పరస్పర చర్చకు, సపోర్ట్‌ కోసం సూపర్‌చాట్ వంటి ఫీచర్లకు చెల్లింపులు జరపవచ్చని తెలిపింది.   

click me!